0px

యూట్యూబ్‌ ను షేక్ చేస్తున్న 'లవ్ స్టోరీ' ట్రైలర్...

1 month ago

అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం 'లవ్ స్టోరీ' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చైతు కి జోడిగా సాయి పల్లవి నటిస్తోంది.ప్రేక్షకులలో శేఖర్ కమ్ముల సినిమాపై ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గుడ్ కాఫీ లాంటి సినిమాలు తీయడంలో శేఖర్ కమ్మలే దిట్ట అని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఉత్తమ ప్రేమ కథలను తెరకెక్కించే శేఖర్ కమ్ముల ఎట్టకేలకు ఫిదా సినిమాతో వచ్చి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. దానితో ఇప్పుడు చైతూ హీరోగా నటిస్తున్న 'లవ్ స్టోరీ' సినిమా పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. తాజా ఈసినిమా ట్రైలర్ నిన్న విడుదల చేశారు చిత్ర యూనిట్ . ఈ ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ట్రైలర్ విడుదలైన  కొన్ని గంటలలోపు , 5 మిలియన్ వ్యూస్‌ వచ్చాయి. ట్రైలర్ విడుదలైన పది గంటల్లో 300 మిలియన్ లైక్స్ అందుకుంది. ఆకట్టుకునే ఈ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా ఎలాంటి రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి.