0px

"రొమాంటిక్" విడుదలకు సిద్ధం...

3 weeks ago

దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి 'మెహబూబా' చిత్రంతో హీరోగా తెలుగు సినీపరిశ్రమకు పరిచయం అయ్యాడు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం కావడంతో ఆయన కొంత గ్యాప్ తీసుకొని "రొమాంటిక్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తున్నది . ఈ సినిమాలో హీరోయిన్‌గా కేతిక శర్మ కనిపించనుంది. అనిల్ పాడూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోంది. పూరి జగన్నాథ్ ,ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కిందటి సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడడంతో అందరు ఈ సినిమా ఓటిటి బాట పడుతుందని అనుకున్నారు .

ఆ తరువాత ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూన్ 18 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని కారణాల వల్ల, ఆ రోజు కూడా ఈ సినిమా విడుదల కాలేదు.తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించారు. ఈ మూవీ నవంబర్ 4 న థియేటర్లలో విడుదల కానున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్ . ఆకాష్ సినిమా విజయంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులకు ఈ సినిమా పై అంచనాలను పెంచాయి మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.