తమిళ హీరో అజిత్ కి తమిళంలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయనకు అక్కడ మాస్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంది. అజిత్ గత కొంతకాలంగా వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. తన సినిమాలు తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలయ్యేలా చూసుకుంటాడు. అలాగే ఆయన తాజా చిత్రం 'వలిమై' తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తమిళంలో 'వలిమై' టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగులో 'బలం' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జనవరి 13న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. న్యూ ఇయర్ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. బోనీ కపూర్ నిర్మించిన ఈ చిత్రానికి వినోద్ దర్శకత్వం వహించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో హుమా ఖురేషి హీరోయిన్ గా కనిపించనుంది. టాలీవుడ్ యువ హీరో కార్తికేయ ఈ సినిమాలో విలన్ గా నటిస్తూ తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు . మరి ఈ సినిమా అతనికి ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.