0px

చెన్నైపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం...

2 weeks ago

ఐపిఎల్‌లో మరో ఆసక్తికరమైన మ్యాచ్ జరిగింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా జరిగిన ఈ పోరులో ఢిల్లీ విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన చెన్నై నిర్ణిత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. అనంతరం 137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది.