0px

కొత్త ఫోటోషూట్ తో సితార...

4 months ago

మహేష్-నమ్రత గారాల కూతురు సితార సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పండుగలు..వేడుకలు వచ్చాయంటే ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సితార సొంత ఛానెల్ లో చేసే సందడి అంతా ఇంతా కాదు. సితార కూడా నాన్న మహేష్‌ని ఇంటర్వ్యూ చేసే స్థాయికి ఎదిగింది. సితార కొత్త ఫోటో షూట్ ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా సితార సమ్ థింగ్ స్పెషల్ గా కనిపిస్తూ చూపును తనవైపు తిప్పేసుకుంటోంది.టాప్ లో మెటాలిక్ షీన్ పెప్లమ్ ర్యాప్ ప్యాటర్.. సితార బాటమ్ లో పిస్తా పచ్చని టుటు స్కర్ట్ తో పింక్ బ్యాక్ గ్రౌండ్ లో ఎంతో అబ్బురపరుస్తుంది. సీతార క్యూట్ లుక్ ఆకట్టుకుంది. మరొక ఫోటోగ్రాఫ్‌లో పారాసోల్‌లెస్ గొడుగుతో కెమెరాకు ఫోజులివ్వడం మరింత ఆకర్షణను తెచ్చింది. సితార కర్లీ హెయిర్‌కి మరింత మెరుపు వచ్చిందని అంటున్నారు. అలాగే మ్యాచింగ్ షూస్ లుక్ పూర్తిగా మార్చేసాయి. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహేష్ అభిమానులు సితార ను క్యూట్ లుక్ లో చూసి మురిసిపోతున్నారు. సితార లో ఇప్పుడిప్పుడే హీరోయిన్స్ ఫీచర్లు బయటకు వస్తున్నాయి! అంటూ ఓ నెటిజన్ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు.

ప్రస్తుతం మహేష్ ఫ్యామిలీ దుబాయ్ లో వెకేషన్ లో ఉంది. మహేశ్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త సినిమా తొలి షెడ్యూల్‌ దుబాయ్‌లో జరుగుతోంది. ఇందులో భాగంగా డిసెంబర్ 31 వేడుకలను కుటుంబ సమేతంగా జరుపుకునేందుకు వీరంతా దుబాయ్ వెళ్లారు. ఇప్పటికే మహేష్ తన కూతురుతో కలిసి దుబాయ్ లో దిగిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఉదయాన్నే మంచి బ్రేక్‌ఫాస్ట్‌కి తండ్రీకూతుళ్లు కలిసి వెళ్తున్న ఫోటో అది. దుబాయ్ నుండి సితార కొత్త ఫోటో సెషన్? లేదా ఇది త్రోబాక్ ఫోటో షూట్ నా ? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. 2022 ప్రథమార్థంలో మహేష్ నటించిన సర్కార్ వారి పాటలను విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించారు.