0px

టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన డికాక్....

4 months ago

సెంచూరియన్ వేదికగా భారత్ ,దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మొదటి టెస్టులో భారత్ 113 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే ఆ ఓటమి తో దక్షిణాఫ్రికా జట్టు వికెట్ కీపర్ కమ్‌ బ్యాటర్‌ క్వింటన్‌ డికాక్‌ టెస్ట్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించాడు. అయితే క్రికెట్ సౌతాఫ్రికా కూడా అతని రిటైర్మెంట్‌ను ధృవీకరించింది. భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డికాక్ 34, రెండో ఇన్నింగ్స్‌లో 21 పరుగులు చేశాడు.అయితే ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఓడిపోవడంతో డికాక్ తన టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్‌ ప్రకటించి అందరినీ ఆశ్చ్యపరిచాడు.

తన కుటుంబంతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు డికాక్ చెప్పాడు. చాలా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని,“ఇది అంత సులభంగా తీసుకున్న నిర్ణయం కాదు.. నా భార్య సాషా, నేను మా మొదటి బిడ్డను ఈ ప్రపంచంలోకి స్వాగతించబోతున్నాం.. నా జీవితంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనే దాని గురించి చాలా ఆలోచించా.. నా కుటుంబమే నాకు సర్వస్వం.. మా కుటుంబంతో ఎక్కువ టైమ్ గడపడానికే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన స్పష్టం చేశాడు.