0px

గాంధీ జయంతి నాడు 'ఇదే మా కథ'...

3 weeks ago

ప్రపంచంలో చాలా మందికి తమ కలల గమ్యానికి వెళ్లాలనే కోరిక ఉంటుంది. విభిన్న నేపథ్యాలు కలిగిన నలుగురు బైక్ రైడర్లు తమ గమ్యస్థానానికి వెళ్లే మార్గంలో ఒకరినొకరు తెలుసుకోవడం మరియు ఒకరి గురించి మరొకరు ఏం తెలుసుకున్నారు? గమ్యాన్ని ఎలా చేరుకున్నారు? అనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా 'ఇదే మా కథ'.ఈ రోడ్ జర్నీలో సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక చావ్లా మరియు తాన్య హోప్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గురు పవన్ దర్శకత్వంలో మహేష్ గొల్ల దీనిని నిర్మించారు.

టాలీవుడ్ లోనే తొలి రోడ్డు ప్రయాణం సాహసంగా రూపొందుతున్న ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ ను ఇటీవల విక్టరీ వెంకటేష్ ఇటీవల విడుదల చేశారు.ఆ టీజర్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోందని, సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకున్న ఈ సినిమాను అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా విడుదల చేస్తున్నామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తుండగా,రామ్ ప్రసాద్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.