0px

అఘోరిని పెళ్లి చేసుకున్న అఘోరా

2 months ago

సాధారణంగా అఘోరా అంటేనే ఆశ్చర్యం, కొంచెం భయం కలగడం సహజం. దానికి కారణం అఘోరాల విధివిధానాలే. కొంతమంది అఘోరాలు నగ్నంగా చిన్న గుడ్డకట్టుకొని కనిపించడమే కాకుండా వారి రూపం కూడా భయంకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ అఘోరాలు కాలిన బూడిదను విభూతిగా పరిగణించి ఒళ్లంతా రాసుకోవడం,మానవ శవాలను తినడం వంటి విపరీతమైన పద్ధతులకు ఒకింత భయం కలుగుతుంది. అయితే తాజాగా ఓ అఘోరా తన శిష్యురాలిగా ఉన్న అఘోరిని పెళ్లి చేసుకున్నాడు.

తమిళనాడుకు చెందిన మణికందన్ అనే వ్యక్తి కాశీలో అఘోర ఉపాసన సాధన చేసి అఘోరాగా మారాడు. అనంతరం తన స్వగ్రామానికి వచ్చి జై అఘోర కాళీమాత విగ్రహాన్ని ప్రతిష్టించి అఘోర ఉపాసనను ఇష్టపడిన వారిని శిష్యులుగా చేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో కలకత్తాకు చెందిన ప్రియాంక అనే మహిళ అఘోరీగా మణికందన్ వద్ద మహిళా అఘోరీలకు ఉపాసన చేస్తుంటుంది. అయితే ఈ నెల 22వ తేదీ ఉదయం అఘోర మణికందన్ హిందూ సంప్రదాయం ప్రకారం అఘోరి ప్రియాంకను వివాహం చేసుకున్నాడు.

అయితే వివాహానికి ముందు మరియు తరువాత యజ్ఞాలు చేశారు.అఘోరా మణికందన్ వివాహ వేడుకల తోటి అఘోరాలు, అఘోరీలు నాట్యం చేస్తూ, శంకం, డమరుకం వాయించారు. గతంలో తన తల్లి చనిపోయినప్పుడు తల్లి శవం మీద కూర్చొని అఘోరా సంప్రదాయం ప్రకారం పూజుల నిర్వహించి అంత్యక్రియలు నిర్వహించి వార్తలు నిలిచాడు.