0px

'గాలోడు' టీజర్ విడుదల...

4 months ago

'జబర్దస్త్' కామెడీ షో ద్వారా చాలా మంది కమెడియన్‌ లు మంచి క్రేజ్ తెచ్చుకోగా అందులో సుధీర్ ఒకరు. బుల్లితెరపై ఉన్న క్రేజ్‌తో సినీ రంగ ప్రవేశం చేశాడు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోగా మారాడు. హీరోగా ఒకటి రెండు సినిమాలు చేసినా.. అవి సరిగ్గా ఆడలేదు. అలా అని చెప్పి సుధీర్ తన ప్రయత్నాలను విరమించుకోలేదు.ఆయన తాజాగా నటిస్తున్న 'గాలోడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేశారు. "అదృష్టాన్ని నమ్మిన వాడు కష్టాల పాలవుతాడు.. కష్టాన్ని నమ్ముకున్నవాడు అదృష్టవంతుడవుతాడు .. కానీ నేను ఈ రెండింటినీ నమ్మను. నన్ను నేను నమ్ముతాను" అనే డైలాగ్ తో టీజర్ ప్రారంభమవుతుంది.టైటిల్ చూస్తుంటే ఇదో పక్కా మాస్ సినిమా అని అర్ధమవుతుంది. దానికి తగ్గినట్లుగానే విజువల్స్ సరిగ్గానే ఉన్నాయి. మాస్ యాక్షన్ సన్నివేశాల నేపథ్యంలో ఈ టీజర్ ను కట్ చేశారు. సుధీర్ ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు. సప్తగిరి.. పృథ్వీ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. త్వరలోనే సినిమా విడుదల కానుంది.