0px

'గమనం' విడుదల తేదీ ఫిక్స్...!

2 months ago

శ్రియ శరణ్, నిత్యామీనన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం గమనం. ఈ సినిమా ద్వారా సుజనారావు దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని నిర్మాతలు రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు మరియు జ్ఞానశేఖర్ వి.ఎస్. ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా డిసెంబర్ 10న కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే విడుదల చేయబోతున్నారు. దర్శకురాలు సుజనారావు ఒకే సినిమాలో మూడు విభిన్నమైన కథలను చెప్పే ప్రయత్నం చేశాడు.

శ్రియా శరణ్ ఓ కథలో అలరించనుంది. ప్రేమకథలో శివ కందుకూరి కనిపించనున్నారు. అనాథలు మరియు మురికివాడల నేపథ్యంలో సాగే కథలో ప్రియాంక జవాల్కర్ నటించారు. సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకు డైలాగ్స్ అందించగా, ఇళయరాజా సంగీతం సమకూర్చారు. జ్ఞానశేఖర్ వీఎస్ కెమెరామెన్‌గా పనిచేశారు. విశేషం ఏంటంటే.. నిత్యామీనన్ నటించిన ‘స్కైలాబ్’ డిసెంబర్ 4న విడుదలవుతుండగా, ఆమె నటించిన మరో చిత్రం ‘గమనం’ అదే నెల 10న విడుదల కానుంది. సోనిత్యామీనన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులను ఆకట్టుకుంటుంది.