0px

గంగూబాయి కొంటె సరసం.. శంతను నాటు సరసం..!

7 months ago

బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'గంగూబాయి కతివావాడి' పై నెలకొన్న అంచనాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఒక్క ట్రైలర్ తోనే గంగూబాయి విశ్వరూపం చూపించి సినిమాపై అంచనాల్ని అంతకంతకు పెంచేసింది.

అలియా వన్ ఉమెన్ షో గా సాగుతుందని తెలుస్తోంది. ఇక సినిమా రిలీజ్ సమయం దగ్గరపడటంతో యూనిట్ ప్రచారం పనుల్ని స్పీడప్ చేసింది.

దీనిలో భాగంగా ఒక్కో పాటని శ్రోతల ముందుకు తీసుకొస్తుంది. ఇప్పటికే గంగూబాయి వీడియో సాంగ్ ఒకటి రిలీజ్ చేసి సంగీత ప్రియుల్ని ఆకట్టుకు న్నారు. తాజాగా 'మేరీజాన్' వీడియో సాంగ్ ని పాటని రిలీజ్ చేసారు. ఇందులో అలియాభట్-శంతను మహేశ్వరి మధ్య రొమాంటిక్ యాంగిల్ ని హైలైట్ చేస్తూ మేరీజాన్ పాట సాగుతుంది.

అలియా-శంతను కారులో రొమాన్స్ చేస్తుండగా చోటుచేసుకునే గిల్లికజ్జాల్ని హైలైట్ చేసారు. గంగూబాయి కొంటె సరసనం..శంతను నాటు సరసం పాటలో ప్రత్యేకం. శంతను నాటు సరసనానికి గంగూబాయి అలకపానుపెక్కడం...సిగ్గుతో శంతను ముఖాన్ని చొక్కాతో కప్పేసుకోవడం దాన్ని చూసి అలియా కరిగిపోయి ప్రియుడ్ని హగ్ చేసుకోవడం వినోదభరతింగా సాగుతుంది.

రెండు..మూడు కట్ లు మినహా సింగిల్ టేక్ విజువల్ గా ఉంది. అలియా భట్ ఎక్స్ ప్రెషన్స్ వెంట వెంటనే మార్చి వేరియషన్స్ ఇవ్వడం ఆశ్చర్యపరుస్తుంది. ఇందులో గంగూబాయి వేశ్య పాత్రలో నటిస్తోంది. ఆ తరహా గ్యాంగ్ కి నాయకురాలు. అలాంటి గంగూబాయి మనసుచ్చి ప్రేమించిన యువకి పాత్రలో శంతను మహేశ్వరీ నటిస్తున్నాడు. ఈ పాట మొత్తం 2.5 నిమిషాల నిడితో ఉంది. ఇందులో అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సంజయ్ లీలీ భన్సాలీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 25న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.