0px

ఆకుపచ్చ లెదర్ స్లిట్ డ్రెస్‌లో హాట్ భామ....

1 month ago

బాలీవుడ్ ఐటమ్ బాంబ్ మలైకా ఇన్‌స్టా గ్లింప్సెస్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్‌లతో నెటిజన్ల గుండెలలో మంటలు రేపడం ఆమెకు కొత్తేమి కాదు. యాభైకి దగ్గరగా ఉన్నప్పటికీ మలైకాలో మెరుపులకు కొదువ లేదు. ఇప్పటికీ ది బెస్ట్ కాస్ట్యూమ్స్ ని ఎంచుకుని యువతలో హాట్ టాపిక్ గా మారుతోంది.

మలైకా తాజాగా కొత్త ఫోటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. మలైకా ఆకుపచ్చ లెదర్ స్లిట్ డ్రెస్‌లో మెరిసింది. మెడలో నెక్లెస్‌తో కాళ్లకు హైహీల్స్ ధరించి ప్రత్యేకంగా కనిపిస్తుంది.ఆమె తన రెండు చేతులను వెనక్కి మడిచి, తనదైన స్టైల్ ఎలివేషన్ తో కెమెరాకు ఫోజులిచ్చింది. మలైకా హెయిర్ స్టైల్ చాలా హైలైట్ గా కనిపిస్తుంది. ఆమె తన జుట్టు ను జడ వేసినట్టుగా వెరైటీ రూపాన్ని ఆవిష్కరించింది. నిండుగా శరీరం అంతా కప్పుకుని కనిపించినప్పటికీ థైస్లిట్ లుక్ ఆధిపత్యం చేసిందనే చెప్పాలి. మలైకా కేవలం దుస్తులను హైలైట్ చేయడానికి ఈ ఫోటో సెషన్‌లో పాల్గొంది. ఈ డిజైనర్ లుక్ ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. మలైకా ఫాలోవర్స్ తమదైన శైలి కామెంట్ల లతో సందడి చేస్తున్నారు.

మలైకా వ్యక్తిగత విషయాల విషయానికి వస్తే, ఆమె నటుడు అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.తనకన్నా వయసులో చిన్నవాడైన అర్జున్‌తో బహిరంగంగా చాలా సార్లు మీడియా కంట పడింది .అంతేకాకుండా ఈ జంట పెళ్లి కూడా చేసుకుంటున్నట్లు బాలీవుడ్ మీడియా కథనాలు వచ్చాయి. ఇటీవల మలైకా వివాహం యొక్క గొప్ప దనం గురించి సోషల్ మీడియాలో ఒక పెద్ద పోస్ట్‌ను షేర్ చేసింది. ఈ నేపథ్యంలో, మలైకా మనసు పెళ్లి వైపు మల్లిందంటూ మీడియా కథనాలు హీటెక్కించాయి. వృత్తిపరంగా మలైకా కెరీర్ స్పీడ్ తగ్గింది. మూడు సంవత్సరాల పాటు ఈ ముద్దుగుమ్మకు సినిమా అవకాశాలు లేక ఖాళీలు ఉంటుంది. బుల్లి తెరపై కూడా హోస్ట్‌గా అవకాశాలు రావడం లేదు. గత సంవత్సరం ఆమె`ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్` కార్యక్రమానికి హోస్ట్ గా చేసింది.. తెలుగులో `గబ్బర్ సింగ్`లోని` కెవ్వు కేక` అనే ఐటమ్ సాంగ్‌తో ఆమె ఫేమస్ అయిన విషయం తెలిసిందే.