0px

కమల్ హాసన్‌కు కరోనా పాజిటివ్...

2 months ago

కరోనా వైరస్ మహమ్మారి ఇంకా తన ప్రభావాన్ని చూపుతూనే ఉంది. ఇప్పటికీ ఇంకా కరోనా మహమ్మారి కేసులు నమోదవుతూనే ఉన్నాయి.ఈ క్రమంలోనే తాజాగా తమిళ స్టార్ హీరో కమల్ హాసన్‌కు కూడా కరోనా బారిన పడ్డారు. ఇటీవలే తన సొంత క్లాత్ బ్రాండ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అమెరికా వెళ్లిన కమల్.. తాజాగా ఇండియాకు తిరిగొచ్చారు. ఈ క్రమంలో లక్షణాలు కనిపించడంతో వెంటనే అప్రమత్తమైన కమల్ .. పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.అభిమానులు పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందవద్దని ఎంఎన్‌ఎం పార్టీ వివరణ ఇచ్చింది.ఇదిలా ఉంటే తన ఆరోగ్య పరిస్థితిపై కమల్ స్వయంగా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. యూఎస్ టూర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కాస్త దగ్గు వచ్చింది. దీనితో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నాను. కరోనా ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదు. అందుకని అందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ రాసుకొచ్చారు.

సోమవారం మధ్యాహ్నం కమల్ హాసన్ స్వయంగా తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ట్వీట్ చేశారు.. యూ.ఎస్. పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత తనకు కొంచెం దగ్గు వచ్చిందని, పరీక్షలు చేయగా ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు నిర్థారించారని అన్నారు. ప్రస్తుతం కోవిడ్ కారణంగా ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉన్నానని కమల్ హాసన్ ఆ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని కమల్ హాసన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అభిమానులంతా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే కొందరు మాత్రం. మరిప్పుడు తమిళ బిగ్ బాస్ ను ఎవరు నిర్వహిస్తారనే సందేహాన్ని వ్యక్తం చేశారు.