0px

'ఖిలాడీ' టాకీ పార్ట్ ముగిసింది..!

3 weeks ago

రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఖిలాడీ. 'ప్లే స్మార్ట్' అనేది దీనికి ట్యాగ్ లైన్.దర్శకుడు రమేష్ వర్మ ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ను తెరకెక్కిస్తున్నాడు. మీనాక్షి చౌదరి,డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నా ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్,- టీజర్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది. మ్యూజిక్ ఫెస్టివల్‌లో భాగంగా ఇటీవల విడుదల చేసిన మొదటి సింగిల్‌కు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. అయితే, మేకర్స్ తాజాగా ఈ సినిమా షూటింగ్‌ని అప్‌డేట్ ఇచ్చారు.

'ఖిలాడీ' టాకీ పార్ట్ పూర్తయిందని, ఇంకా రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని చిత్ర యూనిట్ ప్రకటించింది. మిగిలిన పాటల చిత్రీకరణ కూడా పూర్తి చేసి..ఈ చిత్రంను త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది. జయంతిలాల్ గడ పెన్ స్టూడియోస్ సమర్పణలో, ఈ చిత్రాన్ని హవీష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. సుజిత్ వాసుదేవ్ మరియు జి. కె. విష్ణు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.. అమర్ రెడ్డి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ మరియు శ్రీకాంత్ విస్సా 'ఖిలాడీ'కి సంభాషణలు అందిస్తున్నారు. రామ్-లక్ష్మణ్ మరియు అన్బు-అరివు మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్-అనసూయ-ముఖేష్ రుషి-వెన్నెల కిషోర్ - రావు రమేష్ - మురళీ శర్మ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.'క్రాక్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రవితేజ నుండి వస్తున్న 'ఖిలాడీ' సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.