0px

'ఖిలాడీ' సినిమా నుండి మూడో సింగిల్...

4 months ago

రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఖిలాడీ' షూటింగ్ చివరి దశలో ఉంది. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నా ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను ఏ స్టూడియోస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజతో పాటు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ఉన్ని ముకుందన్, మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది. తాజాగా 'ఖిలాడీ' సినిమా నుండి మరో పాటను విడుదల చేశారు చిత్ర యూనిట్.

న్యూ ఇయర్ సందర్బంగా చిత్ర యూనిట్ రవితేజ, మీనాక్షి చౌదరి కలిసి స్టెప్పులేసి “అట్టా సూడకే మత్తెక్కుతాంది ఈడుకే” అనే మూడవ సింగిల్‌ను విడుదల చేశారు.‘ఖిలాడీ’ పెప్పీ పార్టీ సాంగ్ పర్ఫెక్ట్ న్యూ ఇయర్ ట్రీట్ అని చెప్పొచ్చు. శ్రీ మణి స్వరపరచిన ఈ పాటను సమీరా భరద్వాజ్‌తో కలిసి దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా పాడారు. లిరికల్ వీడియోలో హీరోయిన్లతో పాటు అద్భుతమైన కాస్ట్యూమ్స్ సెట్ విజువల్స్ మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. 'ఖిలాడీ' సినిమా ఫిబ్రవరి 11న విడుదల కానుంది.