0px

ఫైనల్ కు చేరుకున్న KKR.

6 days ago

రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఢిల్లీ పై 3 వికెట్ల తేడాతో గెలిచి ఐపిఎల్ ఫైనల్‌కు చేరుకుంది. చివరి ఓవర్ ఐదవ బంతి వరకు సాగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించింది . విజయం కోసం రెండు బంతుల్లో ఆరు పరుగులు అవసరమయ్యే దశలో. కోల్‌కతా బ్యాట్స్‌మన్ రాహుల్ త్రిపాఠి సిక్స్ కొట్టి జట్టును గెలిపించాడు . టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన ఢిల్లీ నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది . 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా కు ఓపెనర్లు శుభారంభం అందించారు.శిఖర్ ధావన్ మరియు శ్రేయార్ అయ్యర్ మినహా ఢిల్లీ జట్టులో ఎవరూ పెద్దగా స్కోర్ చేయలేకపోయారు. దానితో ప్రత్యర్థి భారీ లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయాడు. ఢిల్లీ కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు ఫెర్గూసన్, శివమ్ వికెట్ తీశారు. చెన్నై , కోల్‌కతా మధ్య ఐపిఎల్ ఫైనల్ జరగనుంది.

తొలి వికెట్ కు 96 పరుగులు జోడించారు. వెంకటేష్ అయ్యర్ హాఫ్ సెంచరీ చేయగా. శుభ్ మన్ గిల్ 45 పరుగులు చేశారు. మ్యాచ్ లో కోల్ కత విజయం ఖాయం అనుకున్న దశలో ఢిల్లీ బౌలర్లు అనూహ్యంగా పుంజుకుని వరుస వికెట్లు తీసి కోల్ కతపై ఒత్తిడి పెంచారు. 7 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయింది. కోల్ కత వరుసగా కార్తీక్, మోర్గాన్, షకిబ్, నరైన్ డకౌట్ కావడంతో. మ్యాచ్ చూస్తున్న వాళ్లంతా ఎవరు గెలుస్తారోనని ఉత్కంఠగా ఎదురుచూశారు.

చివరి ఓవర్ లో కోల్ కతా విజయానికి ఏడు పరుగులు కావాలి. అయితే, ఢిల్లీ బౌలర్ అశ్విన్ మొదటి నాలుగు బంతుల్లో ఒక పరుగు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.దానితో కోల్ కతా గెలవడానికి చివరి రెండు బంతుల్లో ఆరు పరుగులు కావాలి. రాహుల్ త్రిపాఠి చివరి ఓవర్ ఐదవ బంతిని సిక్స్ కొట్టగానే కోల్ కతా జట్టు సంబరాలు చేసుకుంది. రేపు జరిగే ఫైనల్లో చెన్నై ని ఢీకొనబోతోంది కోల్ కతా.

చెన్నై ఇప్పటికే 3 సార్లు ఐపిఎల్ టైటిల్ గెలుచుకోగా ,కోల్ కతా రెండుసార్లు టైటిల్ దక్కించుకున్నది . 2012 లో ఈ రెండు జట్ల మధ్య ఐపిఎల్ ఫైనల్ జరుగగా కోల్‌కతా టైటిల్ గెలుచుకుంది. రేపటి మ్యాచ్ లో ఎవరు గెలుస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.