టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే మరియు మైక్ టైసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా 'లైగర్' సినిమా హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా ఆగష్టు 25, 2022న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారకంగా ప్రకటించారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ సినిమా నుండి వరుస అప్ డేట్లను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధంగా ఉన్నారని తెలిసింది. ఎంతలా అంటే నిన్న 'లైగర్' బిటిఎస్ చిత్రాలను, అలాగే ఇన్‌స్టా ఫిల్టర్‌ను విడుదల చేయగా ,అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న "లైగర్" సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను తాజా చిత్ర యూనిట్ విడుదల చేశారు. 53 సెకన్ల పాటు సాగిన ఈ గ్లింప్స్ లో విజయ్ దేవరకొండ బాక్సింగ్ రింగ్ లోకి పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు. రౌడీ బాయ్ పవర్ఫుల్ డైలాగ్స్‌తో పూరి మార్క్ యాక్షన్ సీన్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కి తగ్గట్టుగా సినిమాపై హైప్‌ని పెంచింది. విజయ్ దేవరకొండ ముంబై లోని చాయ్‌వాలా అని ఫస్ట్ గ్లింప్సెస్ వెల్లడించింది. బాక్సింగ్ రింగ్ లోపల విజయ్ ని మునుపెన్నడూ చూడని అవతారంలో చూపించబడ్డాడు. పూరి జగన్నాధ్ స్టైల్లో టీజర్‌ను కట్ చేశారు. అతను పోనీటైల్‌తో సరికొత్త లుక్‌లో ఉన్నాడు. ముంబై వీధుల్లో దూకుడుగా ఉండే ఒక చాయ్‌వాలా ఒక ఎంఎంఏ ఛాంపియన్‌గా ఎలా మారాడనేదే ‘లైగర్’ కథ.
'లైగర్' సినిమాను పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ స్పోర్ట్స్ యాక్షన్ మూవీను హిందీ మరియు తెలుగులో ఒకేసారి షూట్ చేస్తున్నారు . అంతేకాకుండా ఈ సినిమాను తమిళం, మలయాళ,కన్నడ భాషల్లో కూడా డబ్ చేయనున్నారు. విజయ్, అనన్యలతో పాటు ‘లైగర్’ రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ మరియు మకరంద్ దేశ్‌పాండే కూడా ప్రముఖ పాత్రలు పోషించారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 25న పాన్ ఇండియన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.