0px

కొండచరియలు విరిగిపడి 52 మంది మృతి...

1 month ago

ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తుండడంతో కొండ చరియలు విరిగి పడడంతో చాలా చోట్ల రాకపోకలు బందు అయ్యాయి. భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్ లో కొండచరియలు విరిగిపడి 52 మంది మరణించారు, మరో ఐదుగురి ఆచూకీ తెలియరాలేదు. NDRF బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. కొండ చరియలు విరిగిపడడంతో రెండు రోజులుగా నైనితాల్ కు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరదల కారణంగా గత మూడు రోజుల్లో 8,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు.