0px

'మా' అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మంచు విష్ణు....

1 week ago

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణు నేడు 'మా' అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో విష్ణు సోషల్ మీడియాలో తన మొదటి రోజు ఫోటోను షేర్ చేస్తూ "నేను ఈ రోజు 'మా' అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాను! నాకు మీ ఆశీర్వాదాలు కావాలి. వీలైనంత ఎక్కువ సానుకూలతను నాకు పంపండి" అంటూ ట్విట్ చేశాడు . నరేష్ నుండి బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు 'మా' అధ్యక్షుడిగా కొనసాగుతుండగా ,మాదాల రవి ఉపాధ్యక్షులుగా, రఘుబాబు కార్యదర్శిగా మరియు శివబాలాజీ కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. మంచు విష్ణు ప్రకాష్ రాజ్‌ను అధ్యక్షుడిగా ఓడించారు. డ్రామాలు ,విమర్శలు మరియు ఆరోపణల మధ్య, మంచు విష్ణు ప్యానెల్ మెజారిటీ సాధించింది. మరోవైపు ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు 'మా' కి రాజీనామా చేయడమే కాకుండా బయట నుండి చూస్తూ ప్రశ్నిస్తామని అంటున్నారు.