0px

బుర్జ్ ఖలీఫాపై మహేశ్ బాబు,వంశీ పైడిపల్లి కుటుంబాల సందడి..

4 months ago

పైడిపల్లి ఫ్యామిలీ ప్రస్తుతం దుబాయ్ సెలబ్రేషన్‌లో టాలీవుడ్ హీరో మహేష్ ఫ్యామిలీతో ఫుల్ హల్ చల్ చేస్తోంది. డిసెంబర్ 31న మిడ్‌నైట్ పార్టీ మొదలు జనవరి తొలివారంలో ఈ కుటుంబాలు దుబాయ్‌లోనే వేడుకలు జరుపుకోనున్నాయి. ఆ మేరకు తాజాగా పైడిపల్లి.. మహేష్ ఫ్యామిలీలు సెల్ఫీలు షేర్ చేయగా వైరల్ గా మారాయి. 2021కి బాయ్ చెబుతూ రెండు కుటుంబాలు 2022కి వెల్కం చెప్పేందుకు ఇలా ప్లాన్ చేసుకున్నాయి.గత ఏడాది కూడా జనవరి 1 వేడుకలకు మహేష్, పైడిపల్లి కుటుంబాలు కలిసి దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే.

దర్శకుడు వంశీ పైడిపల్లికి సూపర్‌స్టార్ మహేష్ కుటుంబంతో స్నేహానుబంధం గురించి తెలిసిందే. మహేష్ - నమ్రత దంపతులతో పైడిపల్లి - మాలిని పైడిపల్లి చాలా క్లోజ్ గా ఉంటారు. ఈ జంటల వారసురాళ్లు సితార మరియు ఆద్య కూడా ఒక యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించి సోషల్ మీడియాలో దూసుకువెళ్ళుతున్నారు. A&S పేరు ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా ప్రమోషన్‌ను దక్కించుకున్నారు. రెండు కుటుంబాలు కలిసి ఫారిన్ వెకేషన్స్ కి లేదా హైదరాబాద్‌లో డిన్నర్ డేట్ కోసం వెళుతుంటారు. సరదా సాయంత్రాలు.. మంచి సమయాలు!! ఆస్వాధించడం ఈ కుటుంబాలకు నిత్యవ్యాపకం.'మహర్షి' సినిమాతో ఘనవిజయం సాధించిన మహేష్-పైడిపల్లి జంట మరో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కానీ స్క్రిప్ట్ పరంగా వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత తమిళంలో దళపతి విజయ్‌తో కలిసి పనిచేసే అవకాశం పైడిపల్లికి వచ్చింది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. మహేష్ `సర్కార్ వారి పాట` పూర్తి చేసి ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అయిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ తర్వాత పైడిపల్లితో కలిసి పనిచేసే అవకాశం ఉంది. అప్పటికి పైడిపల్లి దళపతి విజయ్‌తో పాన్ ఇండియా పూర్తి చేసి, మహేష్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తాడు.