0px

43 మంది మావోయిస్టుల లొంగుబాటు...

1 month ago

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులకు గట్టి దెబ్బ తగిలింది. ఎస్పీ సునీల్ దత్ శర్మ మరియు SRPF అధికారుల ముందు మొత్తం 43 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో తొమ్మిది మంది మహిళలు ఉండగా, వీరంతా అనేక కేసుల్లో నిందితులని ASP సునీల్ దత్ శర్మ అన్నారు. వీరు మావోయిస్టు పార్టీలో చురుకుగా ఉన్నారని, వీరిలో ఒకరికి మావోయిస్టుపై రూ.లక్ష రూపాయలవరకు రివార్డు ఉందని ఆయన చెప్పారు. మిగతా వారి అందరిపై రూ. 10,000 రివార్డు ఉందని ఎస్‌పి సునీల్ దత్ శర్మ చెప్పారు, కుకనార్ గాడిరాస్, పుల్బాజీ మరియు చింతగుప్ప పోలీస్ స్టేషన్‌ల పరిధిలోని గ్రామాలకు చెందిన వారని ,ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఒకేసారి పోలీసులకు లొంగిపోవడం మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెబుతున్నారు.

లొంగిపోయిన నక్సల్స్ ఇప్పుడు ‘పునా నార్కోమ్’ జిల్లాలో పోలీసులు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో నివసించనున్నారు. పునరావాస విధానం ప్రకారం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం వారికి సౌకర్యాలను అందిస్తుంది. ఈ సంవత్సరం ఆగస్టు నుండి ఇప్పుడు లొంగిపోయిన మావోయిస్టులతో కలిపి మొత్తం హింసను విడిచి పెట్టిన వారి సంఖ్య 176 కి చేరుకుంది.