0px

'హరిహర వీరమల్లు' నుండి క్రేజీ అప్డేట్...

1 month ago

పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ 'వకీల్సాబ్' తో అభిమానులను మూడేళ్ల గ్యాప్ మర్చిపోయేలా చేయగలిగాడు. ఇప్పుడు అతను వరుస సినిమాలను ట్రాకెక్కిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రస్తుతం భీమ్లానాయక్, హరిహరవీరమల్లు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. తర్వాత హరీష్ శంకర్ మరియు సురేంద్రరెడ్డి సినిమాలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత అనిల్ రాడిపూడి, శేఖర్ కమ్ముల మరియు పూరి జగన్నాథ్ వంటి దర్శకులు అతనితో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమా ఇప్పటివరకు సగం షూటింగ్ పూర్తి చేసుకున్నది. అయితే దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన 'కొండపోలం' సినిమా విడుదల మరియు ప్రమోషన్ల కారణంగా దర్శకుడు క్రిష్ 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ కు కొంత గ్యాపు ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 25 న తిరిగి పునఃప్రారంభం కానుంది.

'హరిహర వీరమల్లు' సినిమా 17 వ శతాబ్దపు బ్యాక్ డ్రాప్ తో ఫిక్షనల్ స్టోరీగా తెరకెక్కుతుంది. దర్శకుడు క్రిష్ ఈ చిత్రం కోసం భారీ సెట్లను నిర్మించారు మరియు హాలీవుడ్ సాంకేతిక నిపుణులను రంగంలోకి దించారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ కూడా ప్రాక్టీస్ చేశారు. నిధి అగర్వాల్ మరియు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. గతంలో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. మరి ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుని ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి మరి.