0px

దసరా బరిలో "వరుడు కావాలి"....

3 weeks ago

లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నటిస్తున్న సినిమా "వరుడు కావాలి".ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నదియా, మురళీ శర్మ మరియు వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నా ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు త్వరలో ప్రారంభమవుతాయి.చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 13 న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొన్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ "వరుడు కావాలి"