0px

'నాట్యం' రివ్యూ....

8 months ago

ప్రముఖ కూచిపూడి నర్తకి సంధ్యరాజు స్వీయ నిర్మాణంలో రూపొందించిన 'నాట్యం' చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సంధ్యా రాజు ఈ చిత్రంతో నటిగానే కాకుండా కొరియోగ్రాఫర్‌గా, ప్రొడక్షన్ డిజైనర్‌గా మరియు కాస్ట్యూమ్ డిజైనర్‌గా అరంగేట్రం చేశారు. రేవంత్ కోరుకొండ ఈ సినిమాకు దర్శకత్వం, సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. చిరంజీవి - బాలకృష్ణ - వెంకటేష్ - రవితేజ - రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగం అవడం, సంధ్యారాజు ప్రయత్నాన్ని అభినందిస్తూ ప్రశంసలు కురిపించడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. నిష్రింకాల ఫిల్మ్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'సాగర సంగమం', 'శంకరాభరణం', 'స్వర్ణకమలం' మరియు 'సిరిసిరి మువ్వ' వంటి కళాత్మక చిత్రాలు నృత్యం మరియు సంగీతాన్ని ప్రధాన ఇతివృత్తాలుగా తీసుకుని, తెలుగు సినీ ప్రేమికుల్లో చెరగని ముద్ర వేశాయి. కానీ కళాత్మక చిత్రాలను మెచ్చుకుంటారు తప్ప.. కాసులు కురిపించరని చాలా సినిమాలు నిరూపించాయి. అందుకే చిత్రనిర్మాతలు అలాంటి ప్రయత్నాలు చేయడానికి సాహసించరు. అటువంటి పరిస్థితులలో, సంధ్యరాజు-దర్శకుడు రేవంత్ నాట్యాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని 'నాట్యం' చిత్రాన్ని ప్రదర్శించారు.

సినిమా విషయానికి వస్తే ... సితార (సంధ్య రాజు) సంప్రదాయ నృత్యానికి ప్రసిద్ధి చెందిన నాట్యం అనే గ్రామంలో ఒక నృత్యకారిణి, సితార తన బాల్యంలో అద్భుత నర్తకి నవల కథ గురించి వింటుంది. ఆ కథపై ఆసక్తితో డ్యాన్స్ నేర్చుకుంటుంది. తన గురువు (ఆదిత్య మీనన్) చెప్పిన నవల కథను అందరి ముందు ప్రదర్శించాలని లక్ష్యంగా పెట్టుకుంటుంది. అయితే సితార కోరికను ఆమె గురువు అడ్డు చెప్పడానికి కారణం ఏమిటి? అసలు నవల కథ ఏమిటి? ఆ కథను సితార ప్రజలందరి ముందు ప్రజెంట్ చేసిందా లేదా ? సితార జీవితంలో పాశ్చాత్య నర్తకి రోహిత్ (రోహిత్ బెహల్) - హరి (కమల్ కామరాజ్) పాత్ర ఏమిటి? చివరకు ఆమె కథ ఎలా ముగిసింది? అదేంటో తెలియాలంటే ‘నాట్యం’ సినిమా చూడాల్సిందే. అయితే టాలీవుడ్ స్టార్స్ అంతా కలిసి ప్రమోట్ చేసిన ‘నాట్యం’ సినిమాకు తొలిరోజు మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఎంచుకున్న స్టోరీ లైన్ ..దాన్ని ప్రారంభించిన విధానం బాగున్నా ,భావోద్వేగభరితమైన ఎమోషనల్ డ్రామాగా చెప్పడంలో విఫలమయ్యారని ప్రేక్షకులు చెప్పుతున్నారు . రొటీన్ స్క్రీన్ ప్లే .. సాగదీసే సన్నివేశాలు హీరోహీరోయిన్ల మధ్య ప్రేమను పెంచే బలమైన సన్నివేశాలు లేకపోవడం ఇందులో మైనస్ పాయింట్స్ అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ ఆశించిన స్థాయిలో లేకున్నా.. సీరియల్ తరహా సన్నివేశాలు జనాలకు బోర్‌గా అనిపిస్తాయి. మొత్తం మీద 'నాట్యం' సినిమా కొన్ని చోట్ల మాత్రమే ఆకట్టుకుందని ప్రేక్షకులు తీర్పు ఇచ్చారు.

కాకపోతే ‘నాట్యం’ సినిమాలో నటించిన సంధ్యారాజుకు మంచి మార్కులు పడుతున్నాయి. తొలి సినిమాలోనే సితార పాత్రలో సంధ్యారాజు నటన.. క్లాసికల్ నృత్యంలో ఆమె ప్రతిభ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. శ్రావణ్ భరద్వాజ్ అందించిన పాటలను సంధ్యారాజు తెరపై ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. ప్రారంభంలో కమల్ కామరాజ్‌తో .. చివర్లో రోహిత్‌తో సంధ్య చేసే నృత్యాలు ప్రేక్షకులను అలరిస్తాయి. నిష్రింకా ఫిల్మ్స్ బ్యానర్ నిర్మాణ విలువలను అందరూ అభినందిస్తున్నారు. కథా నేపథ్యాన్ని నమ్మడం మరియు నృత్యం గురించి చెప్పడానికి వారి ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు .

తాజా వార్తలు