0px

గోధుమ రంగు దుస్తులలో నిధి అగర్వాల్ కొత్త లుక్...

1 month ago

నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ నిత్యం తన అభిమానులతో టచ్‌లో ఉంటూ భారీ ఫాలోయింగ్ పెంచుకుంటుంది . అభిమానుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అంతేకాకుండా వరుసగా క్రేజీ స్టార్స్ సరసన నటించే అవకాశాలను అందుకుంటున్నది .వీలైనంత త్వరలోనే ఆమె స్టార్‌డమ్‌ని సాధించడం ఖాయమని అర్థమవుతోంది. ఈ అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త మైలురాయిని అధిగమించింది. ఇన్‌స్టా లో కోటి 30 లక్షల (13 మిలియన్) మంది ఫాలోవర్స్ ని సాధించింది.

ఈ సందర్భంగా ఆమె తాజా ఫోటోషూట్‌తో అభిమానుల ముందుకు వచ్చారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. నిధి ఆమె కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన గోధుమ రంగు దుస్తులను ధరించి కనిపించింది. నిధి ఈ దుస్తులలో ఒంపుసొంపుల్ని చాలా అందంగా ఆవిష్కరించింది.

కెరీర్ విషయానికి వస్తే ... నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి జోడిగా `హరి హర వీర మల్లు`సినిమాలో నటిస్తోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిధి ఒక నర్తకిగా నటిస్తోంది. మరోవైపు మహేష్ కజిన్ గల్లా అశోక్ హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా నటిస్తున్నది. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ - పద్మ దంపతుల వారసుడు అశోక్ గల్లా హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న చిత్రంలో నిధి గ్లామరస్ పాత్ర లో నటిస్తున్నది .టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ, గల్లా అరుణకుమారి సమర్పణలో గల్లా పద్మావతి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. అమర్ రాజా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది.ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.