0px

ఆసక్తికరంగా 'పంచతంత్ర' టీజర్...

1 week ago

'అడవిలోని జంతువులన్నీ కూడు ,గూడు , తోడు దొరికిన తరువాత నాల్గవ జీవనోపాధి కోసం ఒకే చోట కలుసుకున్నాయి. ఆ జీవనాధారమే కథలు. సింహం విసిరిన పంజా కథలు, చిరుతపులి పెట్టిన పరుగుల కథలు , ఈగ చెప్పే బాహుబలి కథలు వినడానికి వచ్చిన వాటికీ ముసలి తాబేలు కనిపించింది. కదలడం కష్టంగా ఉన్న నువ్వేం కథలను చెప్పగలరా అని అడిగినప్పుడు, జవాబగునా ఆకాశం అంత అనుభవంతో కథలు మొదలయ్యాయి. అంటూ ఓ వాయిస్‌తో డైలాగ్‌లు చెపుతుండగా, సన్నివేశాలు కూడా ఆ వాయిస్ తో పాటే కొనసాగుతాయి. 'పంచతంత్రం' అనే విభిన్నమైన టైటిల్ తో 'ఇవి మీ కథలు, మన కథలు' అంటూ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను మన ముందుకు తీసుకొస్తున్నారు దర్శకుడు హర్ష పులిపాక. బ్రహ్మానందం, సముతిర కని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'పంచతంత్రం'. హర్ష పులిపాక రచన,దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలై పోస్టర్ల లు ఈ సినిమా పై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ సినిమాలోని పాత్రలను పరిచయం చేసిన చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమా నుండి టీజర్ ను విడుదల చేశారు.ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది.