0px

'రాజవిక్రమ' విడుదల తేదీ ఫిక్స్....

1 month ago

RX100 సినిమా తో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చి తన మొదటి సినిమాతోనే నటుడిగా మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు కమర్షియల్ విజయాన్ని కూడా సాధించిన కార్తికేయ ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఒకవైపు హీరోగా నటిస్తూనే మరో వైపు విలన్ గా నటిస్తున్న కార్తికేయ ప్రస్తుతం ప్రధాన పాత్రలో నటిస్తున్న 'రాజావిక్రమార్క' సినిమాతో ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. విభిన్నమైన బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను నవంబర్ 12 న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు చిత్ర యూనిట్. శ్రీ సరిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కార్తికేయ లుక్ మరియు క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

కార్తికేయ కమర్షియల్ హీరోగా పేరు తెచ్చుకోవడం కంటే మంచి సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో మంచి స్క్రిప్ట్‌లను ఎంచుకుంటున్నారు. అలాంటి వాటిలో ఒకటి రాజా విక్రమార్క.ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడో పూర్తి చేసుకుని ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా చిత్రీకరణ ఆలస్యమైంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేయాలనే పట్టుదలతో ఇతర చిత్రాలు పోటీ ఉన్నప్పటికీ నవంబర్ 12 న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సిద్ధం అయ్యింది. ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా నేపథ్యంలో ఈ సినిమా దీపావళి పండుగ సందర్బంగా భారీ ఎత్తున విడుదల కానుంది.

నాగశౌర్య నటించిన 'లక్ష్యం' మరియు ఆనంద్ దేవరకొండ నటించిన 'పుష్పక విమానం' సినిమాలు కూడా నవంబర్ 12 నే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు కార్తికేయ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'రాజావిక్రమార్క' చిత్రం కూడా అదే తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ మధ్య కాలంలో కార్తికేయ స్టార్ డమ్ బాగా పెరిగింది.ఆయన అజిత్‌తో కలిసి వాలిమై చిత్రంలో కీలక పాత్ర పోషించినందున ఆయనకు తమిళంలో కూడా మంచి పేరు రావడం ఖాయం అంటున్నారు. వాలిమై తర్వాత కార్తికేయ ఖచ్చితంగా తెలుగు మరియు తమిళంలో వరుసగా సినిమాలు చేయడం ఖాయం అంటూ పరిశ్రమ వర్గాల వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.