0px

చివరి షెడ్యూల్ కోసం సిద్దమైన రామారావు.

6 days ago

క్రాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రవితేజ ప్రస్తుతం తన 68 వ సినిమాతో బిజీగా ఉన్నాడు. శరత్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి 'రామారావు' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలో రవితేజ కి జోడిగా దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటిస్తోంది.

భారతదేశంలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఈ షెడ్యూల్‌లో పూర్తవుతాయి.అలాగే యూరప్‌లో పాటలు చిత్రీకరించబడతాయి. రవితేజ ఈ సినిమాతో పాటు నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఒక కామెడీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. త్వరలో ‘ఖిలాడీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి మరియు డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు.