0px

రౌడీ బాయ్స్ మూవీ సాంగ్ ను విడుదల చేసిన విజయ్ దేవరకొండ...

1 month ago

ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌కు కొత్త హీరోలుగా కొత్త కుర్రాలు ఎక్కువగా పరిచయం అవుతున్నారు. కొత్త కంటెంట్‌తో తమ ప్రతిభను నిరూపించుకోవడానికి యువ దర్శకులతో ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆశిష్ హీరోగా 'రౌడీ బాయ్స్' సినిమా రూపొందించబడింది. హర్ష కనుగంటి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర పతాకంపై నిర్మించబడింది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం నిన్న రాత్రి పాటల ఆవిష్కరణ వేడుకను జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ వచ్చారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్.. ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులలో సినిమాపై అంచనాల్ని పెంచేశాయి.

ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలు పెట్టింది.ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈ చిత్రం నుండి `అలలే అలలే.. ` అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ ని హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశాడు . ఈ సినిమాకు దేవిశ్రీ సంగీతం అందిస్తుండగా .. మధి ఫొటోగ్రఫీ చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశాయి. ఈ పాటలో ఆశీష్రెడ్డి.. అనుపమ పరమేశ్వరన్ ల కెమిస్ట్రీ కూడా చాలా బాగా కుదిరింది. ఈ సినిమా కోసం అనుపమ మొదటి సారిగా లిప్ లాక్ సన్నివేశంలో నటించింది. అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ... హర్ష .. ఆశిష్ .. అను ..వీళ్లందరితో నేను కొన్ని సందర్భాలలో వారందరితో పరిచయం కలిగి ఉన్నాను. నేను వారి కోసం సమయం కేటాయించాను. ఏదో ఒకవిధంగా నేను ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. హర్ష 'పెళ్లి చూపులు' .. ముందు నుంచొ తర్వాత నుంచో నాకు తెలుసు. అప్పటి నుండి అతను కథలు చెప్పేవాడు. హుషారు' కథను నాకు కూడా చెప్పాడు. నేను అతని కథలన్నీ వింటూనే ఉంటాను. అతను ఇప్పటికీ కాలేజీ కుర్రాడిలాగే ఆలోచిస్తున్నాడు. 'రౌడీ బాయ్స్'లో కూడా కాలేజీ భావాలు .. భావోద్వేగాలు వంద శాతం కనెక్ట్ అవుతాయనేది నా సాలీడ్ ఫీలింగ్. 'హుషారు'తో హిట్ కొట్టిన హర్ష ఈసారి అంతకంటే పెద్ద హిట్ కొట్టాలనుకుంటున్నాడు.

అనుపమ పరమమేశ్వరన్ ను ఉద్దేశించి .. "అను 'ప్రేమమ్' సినిమాలో మీరు నాకు 'మేరీ' లాగా కనిపించారు . మీరు ఆ సినిమాలో చేసినప్పుడు మేమంతా పిల్లల్లా ఉన్నాం. మీ నటన చాలా సహజంగా ఉంటుంది . ఈ సినిమాలో కూడా మీరు చేసుంటారు. ఇక ఆశిష్‌ విషయానికి వస్తే 'నాకు 'పెళ్లి చూపులు' గుర్తుండిపోయినట్లు నీకు ఈసినిమా గుర్తుండి పోవాలని నేను కోరుకుంటున్నాను. ఆశిష్‌లో నాకు చాలా చిత్తశుద్ధి కనిపిస్తుంది. ఈ సినిమా ప్రారంభానికి ముందు అతను ఒకసారి వచ్చి నన్ను కలిశాడు. సినిమా గురించ.. అతనికి నటన పట్ల చాలా ఉత్సుకత ఉందని నేను అప్పుడు గమనించాను. ఆశిష్‌ని ఉద్దేశించి.. "మీ బాబాయ్ .. మీ నాన్నగారు మామూలోళ్లుగాదు.వారు ఎంతో కష్టపడి పనిచేస్తే వారు ఈరోజు ఈ స్థాయికి వచ్చి ఉంటారు. మీరు చేయాల్సిందల్లా వాళ్ళు గర్వపడేలా చేయడం అంతే. మీ నాన్నలో కూడా నాకు టెన్షన్ కనబడుతుంది. ఇన్ని సినిమాలు చేసిన నిర్మాతగా కనిపించడం లేదు. "వారి అంచనాలను అందుకోవడానికి కష్టపడండి. గుడ్ లక్" అని చెప్పాడు.

ఆ తరువాత ఆడియన్స్ ను ఉద్దేశించి ..మన రౌడీ అబ్బాయిలందరూ ఈరోజు ఇక్కడ ఉన్నారు. మీరందరూ నన్ను రౌడీ అని పిలుస్తున్నారు .. ఇక్కడ మరో కొత్త బుల్లి గ్యాంగ్ ఉంది. ఇక్కడ ఆ ఇద్దరు రౌడీ అబ్బాయిల గురించి మాట్లాడాలి. ఆ ఇద్దరు ఎవరంటే రాజు గారు ,శిరీష్ అన్న . నిజామాబాద్ నుండి వచ్చి నాన్-స్టాప్ ఫైటర్ లాగా పనిచేస్తూ వారు ఈ రోజు ఇండస్ట్రీలో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. వారు ఎప్పుడూ ఖాళీగా కనిపించరు. ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇండియా లెవెల్లో కూడా ప్రొడక్షన్ హౌస్ ను తీసుకెళ్లాలని చూస్తున్నారు. దిల్ రాజు గారి నిర్మాణంలో ఒక చిన్న క్యారెక్టర్ కూడా చేయాలని నాకు ఒకప్పుడు కల ఉండేది. నేను ఆడిషన్‌లకు వెళ్లినప్పుడు అక్కడ దిల్ రాజుగారిని చూశాను.. కానీ నేను అతనితో మాట్లాడే ధైర్యం చేయలేదు. ఇప్పుడు రాజు గారు , నేను ఇద్దరం ఫిక్స్ అయ్యాము.. మైండ్ బ్లోయింగ్ మూవీ చేయడానికి. మేము అలాంటి కంటెంట్‌పై పని చేస్తున్నాము.. మేము అలాంటి సినిమాను 100 శాతం దింపుతాం.. త్వరలో ప్రకటిస్తాము " అంటూ ఈ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. నవంబర్ 19 న వస్తున్న ఈ సినిమా ను చూస్తూ ఎంజాయ్ చేయండి" అని చెప్పుకొచ్చాడు.