0px

సైలెంట్‌గా ‘సలార్’ను పూర్తి చేస్తున్న ప్రభాస్...

4 months ago

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'రాధే శ్యామ్' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ వరుస ప్రాజెక్ట్‌ల షూటింగ్‌లను పూర్తి చేస్తున్నాడు. ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ ను కేవలం 60 రోజుల్లో చేశాడు . రీసెంట్ గా 'రాధే శ్యామ్', ‘సలార్’ సెట్స్ మధ్య వరుస షూటింగ్స్ తో చాలా బిజీ షెడ్యూల్ ను గడిపాడ ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్’ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడానికి ఒక లాంగ్ షెడ్యూల్ ఉంది. చివరి షెడ్యూల్ జనవరి 2022లో ప్రారంభమవుతుంది.‘సలార్’ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసి ప్రాజెక్ట్‌పై పూర్తిగా దృష్టి పెట్టాలని ప్రభాస్ ఆసక్తిగా ఉన్నాడు.

ప్రభాస్ కు జోడిగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను హోమ్‌బే ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని 2022 వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ కరోనా కారణంగా సినిమా విడుదల ఆలస్యం అయింది. త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు చిత్ర యూనిట్.‘రాధే శ్యామ్’ సినిమాను 2022 సంక్రాంతి పండుగ సందర్బంగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ‘ఆదిపురుష్’ సినిమా ఆగస్ట్ 2022లో విడుదల కానుంది. తర్వాత ప్రభాస్ కూడా సందీప్ వంగా దర్శకత్వంలో ఒక సినిమాకి సైన్ చేశాడు. ఈ చిత్రం 2023లో ప్రారంభం కానుంది.