0px

త్వరలో తన తదుపరి సినిమాల గురించి అధికారిక ప్రకటన ఇవ్వబోతున్న సమంత.

1 week ago

తెలుగు సినీ పరిశ్రమలో ఊహించని స్థాయికి చేరి దేశంలోనే అత్యంత గొప్ప నటిగా పేరుతెచ్చుకుంది మన సమంత. "ఏం మాయ చేసావే" తో మొదలయ్యి మొన్నటి "ఫామిలీ మాన్" సిరీస్ వరకు తన సినీ ప్రయాణాన్ని గమనిస్తే ఎన్నో ఆటంకాలు దాటుకొని తెలుగు ఇంటి విజేతగా అందరి మనస్సులో నిలిచిపోయింది. ఈ మధ్య కొన్ని వ్యక్తిగత సమస్యల కారణంగా సామాజిక మాధ్యమానికి దూరం ఉన్నప్పటికీ అభిమానులు మాత్రం తన నుంచి ఎప్పుడు సినిమా వస్తుందా అని ఎదురు చూస్తూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఈ దసరా మొదలుకొని తను చేయబోయే సినిమాల పట్టిక అధికారికంగా ప్రకటించనున్నట్లు ప్రముఖ మీడియా సంస్థలు తెలిపాయి. అందిన సమాచారం ప్రకారం, వరుసగా పది సినిమాలకు పైగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు, అవన్నీ ఒక్క భాషలోనే కాకుండా వివిధ భాషలకు సంబంధించిన చిత్రాలుగా తెలుస్తుంది. నెట్టింట్లో వస్తున్నా ఆరోపణలకు ఎదురీతగా వెళ్తూ తన పంథాలో తానూ కష్టపడుతూ నటించటం అనేది మామూలు విషయం కానేకాదు. కాకపోతే మొన్నటి మా ఎన్నికలకు కూడా హాజరు కాకపోవటం పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి కొన్ని వార్తా మాధ్యమాలు. ఇవన్నీ పక్కన పెడితే గుణశేఖర్ తో శాకుంతలం అనే సినిమా టాకీ భాగం పూర్తి చేస్కుని ఇంకొన్ని నెలలో విడుదలకు సిద్ధం చేస్తున్నారని భోగట్టా. మరికొద్ది నెలలో తెలుగులో చేయబోయే సినిమాల గురించి అధికారికంగా తన ట్విట్టర్ ద్వారా పేర్కోనున్నట్లు సమాచారం. అందులో రెండు హిందీ కి సంబందించిన సినిమాలు కూడా ఉండటం విశేషమే అయినా, తెలుగు సినిమాల్లో అతి త్వరగా చూడాలన్నది తన అభిమానుల విన్నపంతో కూడిన కోరిక కూడా.