0px

శ్యామ్ సింగరాయ్ రిలీజ్ డేట్ ఫిక్స్

6 days ago

నేచురల్ స్టార్ నాని ఇటీవల టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. OOT లో నేరుగా విడుదలైన ఈ చిత్రం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది . ఇదిలా ఉండగా, శ్యామ్ సింగరాయ్ షూటింగ్ పూర్తి కాగా , ప్రస్తుతం' అంటే సుందరాణి ' సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సాయి పల్లవి, మృత్తిక శక్తి మరియు మడోన్నా సెబాస్టియన్ ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే, తాజాగా ఈ సినిమా నుండి పెద్ద అప్‌డేట్ వచ్చింది. దసరా పండుగ కానుకగా చిత్ర యూనిట్ ఈ మూవీ నుండి ఈ అప్‌డేట్‌ను ఇచ్చింది. ఈ సినిమా డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది . ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర బృందం తమ అధికారిక ట్విట్టర్ ఖాతా వేదికగా ఈ ప్రకటన చేసింది. అయితే, విడుదల తేదీని మాత్రం చిత్ర యూనిట్ ఇంకా ప్రకటించింది. త్వరలో దీనిపై స్పష్టత రానున్నది .