0px

కివీస్‌తో టెస్టు సిరీస్‌లోకి సూర్యకుమార్?

2 months ago

ఇటీవల జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్‌ను వైట్‌వాష్ చేసిన భారత జట్టు ఇప్పుడు టెస్టు సిరీస్‌పై దృష్టి సారించింది. ఇరు జట్ల మధ్య ఈ నెల 25న తొలి టెస్టు ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులోకి బీసీసీఐ మరో ఆటగాడిని చేర్చుకుంటుందనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం భారత జట్టులో మంచి టచ్ ఉన్న ఆటగాళ్లలో సూర్యకుమార్ యాదవ్ కూడా ఒకరు. అయితే, కివీస్‌తో జరిగే రెడ్ బాల్ సిరీస్‌లో అతడ్ని భారత జట్టులో చేర్చనున్నారని తెలుస్తుంది.

అయితే, UAEలో IPL 2021 రెండవ సగం ప్రారంభానికి ముందు ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో తలపడిన భారత జట్టులో సూర్యకుమార్ సభ్యుడు. కానీ తుది జట్టులో అతడికి ఆడే అవకాశం రాలేదు. అయితే ఇప్పుడు భారత్‌లో కివీస్‌తో జరగనున్న టెస్టు సిరీస్ కోసం సూర్యకుమార్ మళ్లీ టెస్టు జట్టులోకి రానున్నాడు అని సమాచారం. రెడ్ బాల్ క్రికెట్‌లో మొత్తం 77 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ 44 సగటుతో 5,356 పరుగులు చేశాడు. అందులో 14 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.