0px

"14" మూవీ టీజర్ ను విడుదల చేసిన హీరో శ్రీ విష్ణు.

6 days ago

రాయల్ పిక్చర్స్ పతాకంపై నోయల్, విశాఖ ధీమాన్, పోసాని కృష్ణ మురళి, శ్రీకాంత్ అయ్యంగార్, రతన్ మరియు జబర్దస్త్ మహేష్ నటిస్తున్న "14" చిత్రానికి లక్ష్మీ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సుబ్బారావు రాయణ మరియు శివకృష్ణ నిచ్చెన నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్‌ని హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హీరో శ్రీ విష్ణు ముఖ్య అతిథిగా హాజరై "14" సినిమా టీజర్‌ను విడుదల చేశారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్‌లో పలువురు ప్రముఖులు సినిమా గురించి మాట్లాడారు.

హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ. 'ఈ సినిమా కొత్త నిర్మాతలు మరియు దర్శకులకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దర్శకుడు చెప్పినట్లు అతను మంచి కథను తీసుకువస్తే నేను అతనితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ సినిమా నోయెల్‌కు మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము ప్రతిరోజూ సుభాష్ మాస్టర్ అడ్డా దగ్గర సమావేశం అవుతాము. మేము ఫిలింనగర్‌కు దూరంగా ఉన్నప్పటికీ, ఆడిషన్స్ జరుగుతున్నాయి అంటేఅందరం కలిసి ఒకే బైక్‌లో ఒకే కారులో ఆఫీసులకు వెళ్తాము. నవీన్, నోయెల్ మరియు సుభాష్ ఎల్లప్పుడూ మంచే జరుగుతుంది . ఈ సినిమా నోయల్ కుఅద్భుతమైన పేరు వచ్చి ఇంకా పెద్ద స్థాయికి వెళ్లాలని మనస్పూర్తిగా కోరుతున్నాను సినిమా టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్' అన్నారు.ఇంకా నిర్మాతలు, దర్శకుడు, నోయల్, ఆర్టిస్ట్ నవీన్, సుభాస్ మాస్టర్, నటుడు లోహిత్ మరియు నటుడు కేశవ్ కూడా సినిమాపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు . నోయల్, విశాఖ ధీమాన్, పోసాని, శ్రీకాంత్ అయ్యంగార్, రతన్, జబర్దస్త్ మహేష్, రూపలక్ష్మి, లోహిత్ కుమార్, కేశవ్ దీపక్ తదితరులు నటిస్తున్న 14 సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నది .