0px

శ్రియ తన కూతురికి ఏ పేరు పెట్టిందో తెలుసా?

1 week ago

టాలీవుడ్ టాప్ హీరోలందరితో కలిసి నటించిన శ్రియ 2018 లో రష్యన్ క్రీడాకారుడు మరియు వ్యాపారవేత్త ఆండ్రీ కోషీవ్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వివాహం తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన శ్రియ ఈమధ్య గమనం ,RRR చిత్రాలలో కీలక పాత్ర పోషించింది. RRR సినిమాలో శ్రియ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలుస్తుంది . అయితే 2020 లాక్ డౌన్ టైం లో ఈ జంట తమ బిడ్డకు జన్మనివ్వగా , ఆ విషయాన్ని ఇన్నాళ్లు దాచి పెట్టి తాజాగా ఆ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా చెప్పింది.

2020 లాక్ డౌన్ సమయంలో ప్రపంచమంతా అనేక సమస్యలను ఎదుర్కొన్నారు అంతేకాకుండా చాలామంది ఎంతో బాధపడ్డారు. కానీ అదే లాక్‌డౌన్ సమయం మా జీవితంలో సరికొత్త రంగుల్ని నింపింది. ఆనందాన్ని అందించింది . మా ఏంజెల్ రాకతో ఒక అద్భుతం జరిగింది అని తెలిపారు . అయితే తమ కుమార్తెకి రాధ అని పేరు పెట్టినట్లు శ్రియ పేర్కొన్నది . తన భర్త కూడా రాధా పేరు పెట్టడంతో చాలా సంతోషించాడని ఆమె పేర్కొన్నది . రాబోయే రోజుల్లో శ్రియ రాధా పిక్స్‌ని ఒక్కొక్కటిగా వదలనున్నట్లు తెలుస్తోంది.