0px

టీ 20 ప్రపంచకప్ లో రెండో వార్మప్ మ్యాచ్‌లో భారత్ విజయం....

1 month ago

టీ 20 ప్రపంచకప్‌లో అసలు పోరు ప్రారంభానికి ముందు భారత్ అదరగొట్టింది. మొదటి ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇప్పటికే బలమైన ఇంగ్లాండ్ జట్టును ఓడించిన భారత్, బుధవారం జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 8 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టు ఓపెనర్లు వార్నర్ (1) మరియు ఫించ్ (8) ఘోరంగా విఫలమయ్యారు. మిచెల్ మార్ష్ కూడా డకౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం స్టీవ్ స్మిత్ (57), మాక్స్‌వెల్ (37) మరియు స్టెయిన్స్ (41) రాణించడంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేసింది. భారత బౌలర్లలో అశ్విన్ 2 వికెట్లు తీసుకోగా,రాహుల్ చాహర్, భువనేశ్వర్ రవీంద్ర జడేజా తలవు ఒక వికెట్ తీసుకున్నారు.

అనంతరం 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఓపెనర్లు రోహిత్ మరియు రాహుల్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మొదటి ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ బాధ్యతలు స్వీకరించాడు. అతను ఆసీస్ బౌలర్లపై ఆధిపత్యాన్ని కొనసాగించాడు. జట్టు స్కోర్ 68 పరుగుల వద్ద రాహుల్(39)అగార్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. తరువాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్‌తో రోహిత్ శర్మ రెచ్చి పోయాడు. ఈ క్రమములోనే ఆటను 41 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 60 పరుగులు చేసి రిటైర్డ్ ఔట్ అయ్యాడు. సూర్యకుమార్ (38), హార్దిక్ పాండ్య (14) నాటౌట్‌గా నిలిచారు. ఈ నెల 24 న టీ 20 వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.