0px

స్వామి వారిని దర్శించుకున్న 'పెళ్లి సందD' టీం.

6 days ago

'పెళ్లి సందD' చిత్ర యూనిట్ తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకుంది. దర్శకుడు కె. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రోషన్ మరియు శ్రీలీల జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'పెళ్లి సందD'. గౌరీ రోనక్ ఈ సినిమాతో దర్శకురాలుగా పరిచయం అవుతున్నారు. MM కీరవాణి సంగీతం అందించారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విజయదశమి సందర్భంగా అక్టోబర్ 15 న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో, చిత్ర దర్శకురాలు గౌరి..హీరోహీరోయిన్స్ రోషన్ మరియు శ్రీలీల ఈరోజు స్వామివారి ఆశీస్సులు పొందడానికి తిరుమలకు వచ్చి వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.

దర్శనానంతరం రంగనాయకుల మండపంలోని వేద పండితులు వేద ఆశీర్వాద పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రాలతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సినిమా విడుదల నేపథ్యంలో స్వామివారి ఆశీస్సులు తమకు లభించాయని హీరో రోషన్ మరియు శ్రీలీల తెలిపారు. అలాగే దర్శకురాలు మాట్లాడుతూ ఇది పూర్తి కుటుంబ కథా చిత్రం అని, ఓ పండుగలా ఉంటుందని ఆమె అన్నది .