0px

పిటిషన్ ఫైల్ చేసిన ఇంటర్మీడియట్ విద్యార్థులు....

2 weeks ago

ఇప్పుడు చదువుతున్న రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులకు మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం కొన్ని రోజుల ముందు అధికారికంగా కాకపోయినా విద్యా శాఖ ద్వారా జారీచేసింది. అయితే,ఈ వైఖరిని విద్యార్థులు వ్యతిరేకిస్తూ అధికారికంగా పిటిషన్ ఫైల్ చేశారు. పిటిషన్ కావాల్సిన చర్యలు మొత్తం ఆన్లైన్ ద్వారా నమోదు చేయగా, విద్యార్థుల ఆరోజినాన్ని పణంగా పెట్టి ఈ పరీక్షలు నిర్వహించటం సరి కాదు అని ఒక్క పేపర్ ద్వారా నిర్వయించే పరీక్షలు పిల్లలకే కాకుండా వారి కుటుంబాలను కూడా ఆపదలో నెట్టేసినట్లే అని అభిప్రాయం తెలిపారు. రాష్ట్రమంతటా విద్యార్థుల్లో ఇంచుమించు 17000 వేల మంది ఈ పిటిషన్ కోసం నమోదు చేశారు. అయితే ప్రభుత్వం ఇంతవరకు ఈ విషయం పై ఎలాంటి స్టేట్మెంట్ విడుదల చేయలేదు. తల్లిదండ్రుల్లో కూడా ఆందోళన పడుతున్నట్లు సామజిక మాధ్యమం ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. 4 లక్షల విద్యార్థుల భవిషత్తు ఒక్క నిర్ణయం పై ముడిపడి ఉందికాబట్టి విద్యాశాఖ అధికారికంగా ఏదో ఒకటి ప్రకటన ఇచ్చేస్తే ఊపిరి పీల్చుకున్నంత పని అవుతుందని వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలో కూడా తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు సిలబస్ పరంగా కూడా పరుగులు తీస్తున్నట్లు తెలుస్తుంది