0px

రేపటి నుండి దసరా సెలవులు...

2 weeks ago

తెలంగాణలో పాఠశాలలకు దసరా సెలవులు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా రేపు అక్టోబర్ 6 నుండి 17 వరకు సెలవులు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. జూనియర్ కళాశాలలకు ఈ నెల 13 నుంచి 17 వరకు దసరా సెలవులు ఉంటాయి. దసరా సెలవుల్లో ఎలాంటి తరగతులు నిర్వహించవద్దని ఇంటర్ బోర్డు అన్ని జూనియర్ కళాశాలలకు ఆదేశాలు జారీ చేసింది. ఇట్టి ఆదేశాలను కళాశాలలు పట్టించుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. కరోనా కారణంగా మూతపడిన విద్యాసంస్థలు దాదాపు 18 నెలల తరువాత తిరిగి తెరుచుకున్నాయి. కరోనా సమయంలో అంతా ఆన్‌లైన్‌కే పరిమితం కాగా ఇటీవలే భౌతికతరగతులు క్లాసులు ప్రారంభమైన విషయం తెలిసిందే.