0px

'వరుడు కావలెను' సెన్సార్ పూర్తి..!

1 month ago

యంగ్ హీరో నాగ శౌర్య, రీతూ వర్మ నటించిన తాజా చిత్రం 'వరుడు కావలెను'. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంతో డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమవుతోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యమైన ఈ చిత్రం అక్టోబర్ 29 న థియేటర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్లలో వేగం పెంచారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్నట్లు చిత్ర యూనిట్ తెలుపుతూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న 'వరుడు కావలెను' చిత్రానికి సెన్సార్ బోర్డు 'U/A' సర్టిఫికెట్ జారీ చేసిందని దర్శకనిర్మాతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాగశౌర్యకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలు-టీజర్ మరియు పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఈ రోజు (గురువారం) సాయంత్రం 7 గంటలకు ఈ సినిమా ట్రైలర్వి ను విడుదల చేయనున్నారు చిత్ర యూనిట్.

పిడివి ప్రసాద్ సమర్పణలో సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న 'వరుడు కావలెను' సినిమా ప్రేమ - కామెడీ - భావోద్వేగాలు కలగలిసిన అందమైన కుటుంబ కథా సినిమాని, ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ పేర్కొన్నది. విశాల్ చంద్రశేఖర్ - ఎస్ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీని వంశీ పచ్చిపులుసుల అందించారు. ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా.. నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేశారు. గణేష్ రావూరి ఈ చిత్రానికి మాటలు రాశారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, మురళీ శర్మ, నదియా, ప్రవీణ్, హర్ష వర్ధన్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు,‘రంగస్థలం’ మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్ధిక్ష తదితరులు నటించారు. గత సంవత్సరం ప్రారంభంలో 'అశ్వద్ధామ' చిత్రంతో ప్రేక్షకులను అలరించిన నాగశౌర్య కి "వరుడు కావలెను" సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.