0px

దసరా బరిలో "వరుడు కావాలి"...

3 weeks ago

రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న "వరుడు కావాలి" సినిమాలో నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నటిస్తున్నారు. సితారఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంతో దర్శకుడు లక్ష్మీ సౌజన్య పరిశ్రమకు పరిచయమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తున్నా నేపథ్యంలో ఇటీవలే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ ఈ సినిమా పై భారీ అంచనాలను పెంచింది. ఇప్పుడు తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించడంతో నాగశౌర్య అభిమాను ఆనందంలో మునిగితేలుతున్నారు.

"వరుడు కావాలి" థియేట్రికల్ విడుదల అక్టోబర్ 15 న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొన్నారు. ప్రేమ వినోదం మరియు భావోద్వేగాలు కలిపిన అందమైన కుటుంబ కథా చిత్రమిది అని, ఈ సినిమా తప్ప కుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ అభిప్రాయపడింది. విడుదల తేదీ ప్రకటన సందర్భంగా, హీరోహీరోయిన్ తో కూడిన అందమైన పోస్టర్ విడుదల చేయబడింది.

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం లేకపోతే,'వరుడు కావాలి' ఇప్పటికే థియేటర్లలోకి వచ్చేది. వైరస్ భయంతో, సినిమా హాల్‌లకు ప్రజలు వస్తారో రారో అనే అనుమానంతో ఇన్నాళ్ళు విడుదలకుకాస్త వెనుకాడారు. అయితే, ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలకు ప్రేక్షకాదరణ దక్కుతుండటంతో.. ఇప్పుడు ఈ సినిమాను థియేటర్లకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు చిత్ర యూనిట్.

అయితే కొన్ని క్రేజీ సినిమాలు దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. అక్టోబర్ 8 న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' మరియు 'కొండపోలం' సినిమాలు వస్తుంటే, 'మహా సముద్రం' అక్టోబర్ 14 న విడుదలవుతుంది. ఈ క్రమంలో 'వరుడు కావాలేను' సినిమా కూడా ఇప్పుడు బరిలోకి దిగుతోంది. మరి ఈ సినిమాలన్నింటిలో ఎన్ని సినిమాలు ప్రేక్షకులను అలరిస్తాయో చూడాలి.

పిడివి ప్రసాద్ సమర్పణలో సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న 'వరుడు కావాలేను' సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చగా, వంశీ పచ్చిపులుసుల సినిమాటోగ్రఫీ అందించారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. నదియా - మురళీ శర్మ - వెన్నెల కిషోర్ - ప్రవీణ్ - హర్ష వర్ధన్ తదితరులు ఈ సినిమాలో ఇతర పాత్రలు పోషించారు.