0px

అతిత్వరలో ముఖ్యమంత్రి జగన్ ని కలవనున్న మోహన్ బాబు మరియు విష్ణు.

1 week ago

గత రెండు నెలలుగా ఆర్టిస్టు అసోసియేషన్ నేపథ్యంలో మీడియాలో వినిపిస్తున్న పేర్లలో మన మోహన్ బాబు మరియు విష్ణులు ముఖ్యులు.ఈ మధ్య వీరి ప్యానల్ అత్యధిక ఓట్లతో ప్రెసిడెంట్ పదవులతో పాటు మిగతా ప్రాముఖ్యమైన పదవులు గెలుపొందిన సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా హడావిడిగా ఉండిపోయిన వార్తల్లో "మా" ఎన్నికల వార్తలు ముఖ్యంశాలు గా మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా సినీపెద్దల్లో ఒకరైన మోహన్ బాబు మరియు కొత్తగా ఎంపికైన "మా" అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు ఒక ముఖ్యమైన వార్తని తెలుగు ప్రజలకు అందించారు.

ఈరోజు సాయంత్రం కొంతమంది విలేఖరులని కలిసి మోహన్ బాబు మరియు విష్ణు మంచు కొన్ని విషయాల రిత్యా తెలుగు ప్రేక్షకులకు మరియు ఆర్టిస్టు సభ్యులకు ఒక ముఖ్య సందేశాన్ని తెలియచేశారు. ఈరోజు ఉదయమే ప్రెసిడెంట్ గా పదవి బాధ్యతలు చెప్పిన విష్ణు, తన నాన్నగారైన మోహన్ బాబు గారితో కలిసి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని త్వరలో కలవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కలయిక వ్యక్తిగతమైంది కాకుండా మన సినిమా వాళ్ళకి ఉపయోగపడే విధంగా మరియు మొన్న మా ఎన్నికల నేపథ్యంలో సబ్యులకు మాట ఇస్తూ నిర్మించిన కొన్ని మేనిఫెస్టో హామీల గురించి జగన్ తో చర్చించి వాటిని వీలైనంత త్వరలో ఆచరణలో పెట్టె లాగా మాటామంతి జరిపి విజయవంతం చేసే ప్రయత్నంలో మాత్రమే ఈ కలయిక వేణుక వున్నా ఉద్దేశం అని తెలిపారు. అనవసరమైన వివాదాలకు దారి తీయకుండా బాధ్యతలన్నీ చేపట్టి ఇకనుంచి వాటి పై మాత్రమే ద్రుష్టి పెట్టి అన్దిర్కి మంచి చేసే ప్రయత్నం లో ఎలాంటి అవాంతరాలు వచ్చిన మాట నిలబెట్టుకుంటాం అని మోహన్ బాబు గారు బహిరంగంగా తెలిపారు. కొన్ని కథనాల ప్రకారం, మా అసోసియేషన్ బిల్డింగ్ కట్టడానికి కొన్ని చర్యలు తీసుకొని అధికారికంగా అతి త్వరలో మొదలు పెట్టేలా సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది.